మెరుగైన వైద్య సేవల కోసం మంత్రికి నివేదిస్తాం
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిని శనివారం సాయంత్రం బోధ న్ శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నూతనంగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనరసింహ ఆదివారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేసిన అనంతరం జీజీహెచ్‌లో ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రులు, వైద్యారోగ్య శాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే , కలెక్టర్ జీజీహెచ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సూపరింటెండెంట్ చాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలను మరింతగా మెరుగుపర్చేందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చాల్సిందిగా సంబంధిత మంత్రికి నివేదిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు సగటున రెండు వేల మంది వరకు రోగులు జీజీహెచ్ కు వస్తున్నారన్నారు. అన్ని విభా గాల పనితీరును మెరుగుపర్చేలా అవసరమైన వైద్యులు, సిబ్బందితో పాటు అధునాతన వైద్య పరికరాలు మంజూరు చేయాల్సిందిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి తెస్తామని తెలిపారు.
ఆస్పత్రిని నిర్మించి సుమారు 14 ఏళ్లు అవుతున్నందున నిర్వహణ పరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్ తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతా ల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొని ఉన్న ఇబ్బందులను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ స భ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ఉన్నారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని
సందర్శించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఆయా విభాగాల అధిపతులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment