‘అర్బన్’ అభివృద్ధికి నిధులివ్వండి
సుభాష్‌నగర్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. శనివారం హైదరాబాద్‌లోని సీఎం చాంబర్‌లో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి ధన్‌పాల్ సీఎంకు వినతిపత్రం అందజేశారు. టీయూఎఫ్‌ఐడీసీ ఫండ్ రూ.60 కోట్లు, నియోజకవర్గ అభివృద్ధి నిధులు రూ.5కోట్లు, స్పెషల్ ఫండ్ రూ.100 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని విన్నవించారు. జిల్లా కేంద్రమైన అర్బన్ నియోజకవర్గంలో రోడ్లు, యూజీడీ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస సదుపాయాలు, డబుల్ బెడ్‌రూం ఇండ్ల మరమ్మతులు, రేషన్‌కార్డులు, తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ధన్‌పాల్ పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని అర్బన్ అభివృద్ధికి పాటుపడాతమని ధన్‌పాల్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన
ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment