కాంగ్రెస్ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులు
నవీపేట: రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని శాఖాపూర్, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల నుంచి శనివారం ఎమ్మెల్యే సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ చివరి ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించి రైతులకు అండగా నిలిచిందన్నారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని, మార్చి చివరివరకు నాలుగు విడతలుగా నీటిని విడుదల చేస్తామన్నారు. భూసారాన్ని పరిరక్షించేందుకు వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. షెడ్డు మాదిరి పందిరిల నిర్మాణానికి ప్రభుత్వం ఎకరానికి రూ.3 లక్షల మేర 50 శాతం సబ్సిడీపై రుణాలిస్తోందని పేర్కొన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు చెరకు సాగుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, గడుగు గంగాధర్, శ్రీనివాస్‌గౌడ్, రాజేంద్రకుమార్‌గౌడ్, గోవర్ధన్‌రెడ్డి, మోబీన్, సాయారెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, బుచ్చన్న, విజయ్,సంజీవ్‌రావు,గౌరు రాజు నీటిపారుదల శా ఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ హయాంలో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల నిర్మాణం
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
అలీసాగర్, శాఖాపూర్
ఎత్తిపోతల నీటి విడుదల
Comments
Please login to add a commentAdd a comment