సమ్మె బాటలో పంచాయతీ కార్మికులు!
మోర్తాడ్(బాల్కొండ): సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన ఇంకా కొలిక్కి రాకముందే పంచాయతీ కార్మికులు నిరసనబాట పట్టారు. ప్రభుత్వం తమ పట్ల కనికరం చూపడం లేదని తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా ఈ ప్రభుత్వం అదే ధోరణి అవలంభిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేమరకు తమ సమస్యలను పరిష్కరించాలని రెండు రోజుల టోకెన్ సమ్మెను పంచాయతీ కార్మికులు, కారోబార్లు శుక్రవారం ఆరంభించారు. శనివారం రోజు కూడా ఇలాగే సమ్మెను కొనసాగిస్తామని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 4నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని తెలంగాణ పంచాయతీ కారోబార్లు కార్మికుల సంఘం ప్రకటించింది.
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు, కారోబార్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. అనేక పంచాయతీల్లో నాలుగైదు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఆదాయం ఎక్కువగా ఉన్నచోట, నిధులు సమృద్ధిగా ఉన్న కొన్ని పంచాయతీల్లోనే వేతనం చెల్లింపు సక్రమంగా జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులను కేటాయించి పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు క్రమంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2వ పీఆర్‌సీ పరిధిలోకి పంచాయతీ సిబ్బందిని తీసుకవచ్చి జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలను కేటగిరి ప్రకారం చెల్లించాలని కోరుతున్నారు. జీవో నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ కార్మికుల విధానం రద్దు చేసి పాత కేటగిరిల ప్రకారం ఉద్యోగులను గుర్తించాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్‌లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెన్‌ఫిట్‌గా రూ.5లక్షల చొప్పున చెల్లించాలి. మరణించిన పంచాయతీ కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు ప్లాట్లు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
డిమాండ్లు ఇవే..
3,054 మంది కార్మికులు..
జిల్లాలో కొత్తగా ఆవిర్భవించిన పంచాయతీలు, పాత పంచాయతీలు కలిపి 545 ఉన్నాయి. వీటిల్లో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, వాటర్‌మెన్‌లు, పారిశుధ్య కార్మికులు అందరూ కలిపి 3,054 మంది వరకు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ.9,500ల వేతనంగా నిర్ణయించినా నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారు. వేతనాలు నిలచిపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు.
ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలు
చెల్లించాలని డిమాండ్
ప్రభుత్వం స్పందించకపోతే
ఆందోళన ఉధృతం చేస్తామని
హెచ్చరిక
ప్రభుత్వం స్పందించాలి
పంచాయతీ కార్మికుల న్యాయపరమైన ఆందోళన పట్ల ప్రభుత్వం స్పందించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వమైనా మానవతా ధృక్పతంతో ఆలోచన చేయాలి. ఎన్నికల సంధర్బంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.
– చిలుక మారుతి, గ్రామ పంచాయతీ కారోబార్లు, కార్మికుల సంఘం రాష్ట్ర
ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment