ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: మండలంలోని ఇస్సాపల్లి గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో లక్ష్మయ్య(20) అనే కూలీ మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఉన్నాయి. ఇస్సాపల్లి ఇటుకబట్టి నుంచి ఇటుక లోడ్‌తో ట్రాక్టర్ వెళుతుండగా మూలమలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మయ్య అనే ఇటుకబట్టి కూలీ ఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
ఆర్మూర్‌టౌన్: మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన యాతగిరి నాగేంద్ర(21) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూర్ జిల్లాకు చెందిన నాగేంద్ర అంకాపూర్‌లో నివాసం ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగ అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో నాగేంద్ర మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment