ఒకరి ఆత్మహత్య
మాక్లూర్: మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన కారం మహేందర్ (45) ఆత్మహత్య చేసుకున్ననట్టు ఎస్సై రాజశేఖర్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మహేందర్ ఇల్లు నిర్మించుకోవడానికి అప్పులు చేశాడు. వాటిని తీర్చలేని పరిస్థితిలో అప్పుల బాద తట్టుకోలేక ఒత్తిడికి గురై గడ్డి మందును గురువారం రాత్రి తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని గమనించి చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుతి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
సాలూర మండల కేంద్రంలో..
బోధన్‌రూరల్: సాలూర మండల కేంద్రం శివారులో బోధన్‌కు చెందిన ఆరుగొండ మహేశ్(30) ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మహేశ్ గత కొంతకాలం నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనెల 26న ఇంటి నుంచి రాత్రి సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సాలూర శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఉండగా, మృతదేహాన్ని మహేశ్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధురాలు అదృశ్యం
నిజామాబాద్ రూరల్: ముబారక్‌నగర్‌లోని వీవీనగర్‌కాలనీకి చెందిన తెలన్గు విజయలక్ష్మీ అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ శుక్రవారం తెలిపారు. విజయలక్ష్మీ గత కొన్ని రోజులుగా మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండ బయటకు వెళ్లి, తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వృద్ధురాలు ఎరుపురంగు చీర, క్రీంకలర్ జాకెట్ ధరించి ఉందని, ఎవరికై నా ఆచూకీ లభించినచో 87126 59849, 87126 59847ను సంప్రదించాలని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
ఖలీల్‌వాడి: నగరంలోని గౌతంనగర్‌లో చోరీకి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. కాలనీలోని భక్త మార్కండేయ మందిరంలో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించగా స్థానికులు గమనించి, డయల్ 100కు సమాచారం అందించారు. అప్పటికే దొంగ పారిపోగా త్రీటౌన్ బ్లూకోర్ట్ సిబ్బంది గంగాధర్, నిఖిల్ అతడిని పట్టుకున్నారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment