డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తా
ఆర్మూర్‌టౌన్: ముందు వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వెనకాల వస్తున్న వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా ప్రాంగణం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. నిర్మల్ వైపు నుంచి ఆర్మూర్ వస్తున్న ఆటో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. వెనుక వస్తున్న లారీ డ్రైవర్ ఆటోను ఢీకొట్టకుండా ఒక్కసారి బ్రేక్ వేయడంతో వెనుకలే ఉన్న టాటా ఏస్, రెండు కార్లు, వ్యాన్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనాలు ఢీకొనడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.
సడెన్ బ్రేక్ వేసిన లారీ డ్రైవర్
ఒకదానికి ఒకటి ఢీకొన్న
ఐదు వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment