కొత్త ఏడాదిలో కొత్తగా ఉండాలని..
నిజామాబాద్ రూరల్: కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగిడిన ప్రజలు అంతా మంచే జరగా లని కోరుతూ ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అర్చనలు చేయించారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర, శంభులింగేశ్వర, ఉత్తర తిరుమ ల, అయ్యప్ప, తేనె సాయిబాబా, శుభం కరోతి గణపతి, సిద్ధివినాయక, మహాగణపతి ఆలయాలతోపాటు జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శనం కోసం బారులు తీరారు. నూతన ఏడాదికి స్వాగతం పలుకుతు ఇళ్ల ముందు రంగవల్లులు వేశారు.
నీలకంఠేశ్వరాలయం ఆవరణలో భక్తుల సందడి
కిటకిటలాడిన ఆలయాలు
ప్రత్యేక పూజలు.. అర్చనలు
Comments
Please login to add a commentAdd a comment