నేరాల నియంత్రణకు కృషి చేయాలి
ఖలీల్‌వాడి: నేరాల నియంత్రణకు కృషి చే యాలని ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ సిబ్బందికి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలతో శు క్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణకు ప్రణాళికను రూపొందిచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలని, కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన స్పందించాలన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని, నిఘా వ్యవస్థను ము మ్మరం చేయాలని సూచించారు. సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వారెడ్డి, ప్రొబెషనరి ఐపీఎస్ సాయికిరణ్ పత్తిపాక తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై దాడిలో
ఒళ్లంతా గాయాలు
● చర్మం లేచిపోయి, తల పగిలి
ఇబ్బంది పడుతున్న బాధితుడు
ఇందల్వాయి : ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ తనపై విక్షణా రహితంగా దాడి జరిపాడని నల్లవెల్లి గ్రామానికి చెందిన బాధితుడు మందుల లింగం ‘సాక్షి’కి తెలిపారు. గత నెల 11న పోలీస్ స్టేషన్‌లోనే ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ చితకబాదినట్లు బాధితుడు పేర్కొన్నాడు. గ్రామంలో తాను అప్పు ఇచ్చిన వ్యక్తి సకాలంలో చెల్లించక పోవడంతో అతని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని డబ్బులు ఇచ్చి తీసుకువెళ్లమని చెప్పానని, అప్పు తీసుకున్న వ్యక్తి ఎస్సైని ఆశ్రయించాడని తెలిపాడు. ఎస్సై తనను పిలిపించి విచారణ జరపకుండానే తనపై దాడి చేసినట్లు లింగం ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సై దాడిలో బాధితుడి తల, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. చర్మం లేచిపోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. విషయం ఎవరికై నా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎస్సై హెచ్చరించినట్లు బాధితుడు తెలిపాడు. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి డిసెంబర్ 20న రూ. 80 వేలు ఇప్పిస్తానని చెప్పిన ఎస్సై ఇంతవరకు ఇప్పించలేదన్నాడు. కాగా ఎస్సై దాడి సందర్భంగా బాధితుడు ఎదురు తిరిగాడని, దీంతో స్టేషన్‌లో గలాటా జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా లింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ రెడ్డి ఇటీవల ఎస్సై మనోజ్ కుమార్ ఆగడాలపై ఐజీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై సొంతంగా జేసీబీలతో లింగాపూర్, గౌరారం వాగుల నుంచి ఇసుకను రవాణా చేయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దూసుకొచ్చిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
నవీపేట: కూలీ పనులు చేసుకొని ఇంటికి వస్తున్న దంపతులను మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించింది. నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన మగ్గిడి రాజమణి(50), మగ్గిడి లక్ష్మణ్(57) అబ్బాపూర్(ఎం)లో వరినాట్లకు కూలీలుగా శుక్రవారం వెళ్లారు. సాయంత్రం అక్కడే ఉండే తమ కుమార్తె తనూజ ఇంటికి వెళ్లి భోజ నం చేశారు. తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వ స్తుండగా నవీపేట శివారులోని మిషన్ భగీరథ పంప్‌హౌస్ సమీపంలోని బాసర రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుమారుడు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment