జలసౌధకు వెళ్లాల్సిందేనా..?
నిజామాబాద్‌నాగారం: ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్(సీఈ)ను కలవాలంటే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు హైదరాబాద్‌లోని జలసౌధకు వెళ్లాల్సిందే. నిబంధనల కు విరుద్ధంగా అక్కడే కార్యాలయాన్ని ఏర్పాటు చే సుకున్న ఉన్నతాధికారి ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుని రోజువారి కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పదోన్నతి కోసం ప్ర యత్నాలు చేస్తున్న సదరు అధికారి.. జిల్లా కేంద్రంలో సీఈ కార్యాలయం ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఏ పని ఉన్నా ఫైళ్లు పట్టుకుని హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు.
పర్యవేక్షణ కరువు
నిజామాబాద్ జిల్లాకు రెండేళ్ల క్రితమే సీఈ కార్యాలయం ఏర్పాటైంది. సీఈ పరిధిలో డిప్యూటీ సీఈ, నిజామాబాద్ ఎస్‌ఈ, ఆర్మూర్ ఎస్‌ఈ, డీఈలు, డిప్యూటీ డీఈలు, ఏఈలు, జేఈలు, ఇతర ఉద్యోగులు ఉంటారు. సీఈ పరిధిలోనే ఇరిగేషన్ ప్రా జెక్టులు, కార్యాలయాలున్నాయి. రబీ సీజన్ పనులు ప్రారంభమై ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేస్తున్న తరుణంలో పర్యవేక్షించాల్సిన అధికారి త మనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారి పత్తా లేకపోవడంతో ఇతర అధికారులు సైతం కార్యాలయానికి చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల
నియామకం
జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు క్యాంప్ కార్యల యం సైతం ఇక్కడే ఉంది. అన్ని శాఖలకు బాస్ అయిన కలెక్టర్ ఇక్కడే ఉంటుండగా, ఒకే ఒక్క శాఖ కు అధికారి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా క్యాంపు కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఆ అధికారి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా
హైదరాబాద్‌లో సీఈ కార్యాలయం
ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో కార్యకలాపాలు
ఇబ్బందిపడుతున్న స్థానిక ఉద్యోగులు
సార్‌తో పని ఉంటే కాంట్రాక్టర్లు
అక్కడికి వెళ్లాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment