పెరగనున్న సహకార సొసైటీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పా టు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాలని సహకారశాఖ అధికారులను కోరింది. దీంతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొత్త సొసైటీలు కావాలని జిల్లాలో భీమ్‌గల్, సిరికొండ తదితర మండలాల నుంచి సహ కార శాఖకు వినతులు అందాయి. ఎమ్మెల్యేల అనుమతితో కొత్త సహకార సంఘాల జాబితాను సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదించనున్నారు. జిల్లాలో మొత్తం 89 సొసైటీలు ఉండగా, 2.70 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సొసైటీ ల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనా లు అందించడంతోపాటు రుణాలు కూడా అందిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు, ఇతర కార్యక్రమాలు సైతం సొసైటీల ద్వారానే అ మలవుతున్నాయి. జిల్లాలో 2013 తర్వాత కొత్తగా వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు కాలేదు. ఇటీవల రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ న్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పడిన ప్పటికీ సహకార సంఘాల విభజన మాత్రం జరగలేదు. ఒకే సొసైటీ రెండు మండలాల పరిధిలోకి రావడం అలాగే ఎక్కువ గ్రామాలకు ఒకే సొ సైటీ ఉండడంతో సరైన సేవలందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా వినతులు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది.
విభజన చేయడమే!
కొత్త సొసైటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టిన సహ కార శాఖ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఉన్న సంఘాలను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలా? లేదా కొత్త సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేయాలా అనే కో ణాల్లో ఆలోచన చేస్తున్నారు. అయితే ఉన్న వాటినే విభజన చేస్తారనే అభిప్రాయం సర్వ త్రా వ్యక్తమవుతోంది. మండలానికి కనీసం రెండు కొత్త సొసైటీలు ఉండాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జిల్లా లో 89 సంఘాలుండగా, కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని సహకార శాఖకు పది దరఖాస్తులు అందాయి. గ్రామాల నుంచి ఇబ్బందులు, అభ్యంతరా లు తలెత్తకుండా ఎమ్మెల్యేలు ప రిశీలన చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఫైనల్ చేసినవే కొత్త సొసైటీలుగా ఏర్పాటు కానున్నాయి. అదే విధంగా వ్యవసా య సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెల 19న ముగుస్తుంది. ఈలోపే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త సొసైటీలు ఏర్పాటైతే తమకు సులభంగా సేవలు అందుతాయని రైతులు అంటున్నారు.
నూతన సంఘాల ఏర్పాటుకు కసరత్తు
ఇప్పటికే సహకార శాఖకు
అందిన వినతులు
ప్రభుత్వానికి వెళ్లనున్న ప్రతిపాదనలు
దరఖాస్తులు అందాయి
కొత్త వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు కోసం జిల్లాలో కొన్ని మండలాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. పరిశీలన పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేల ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ఎన్ని కొత్త సంఘాలు ఏర్పాటవుతాయనేది ఇప్పుడే చెప్పలేం. – శ్రీనివాస్‌రావు, జిల్లా సహకార శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment