నిజామాబాద్ అర్బన్: హెచ్‌సీఎల్ టెక్ – బి సంస్థ (ఎస్‌సీఎల్ టెక్‌బీ–జిల్లా ఇంటర్మీడియెట్ విద్య) ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ 2023 – 24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, ప్రస్తుత విద్యా సంవత్సరం (2024–25) రెండో ఏడాది పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు నేడు (బుధవారం) జాబ్ మేళా నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్‌వేర్ రంగంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తామని, 2023 – 24లో ఇంటర్ పూర్తయిన, 2025లో పరీక్షలు రాయనున్న ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ ఒకేషనల్‌లో కంప్యూటర్ బేస్డ్ గ్రూపుల విద్యార్థులు అర్హులని తెలిపారు. బోధన్‌లోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఉదయం 9గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నుంచి 75శాతం మార్కులతో, 60శాతం మ్యాథమెటిక్స్‌లో మార్కులు పొందిన వారు సర్టిఫికెట్లతోపాటు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆండ్రాయిడ్ ఫోన్‌తో జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రతినిధి(80740 65803, 79818 34205)ని సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment