రైతులు ఎక్కడ..?
సమాచారం ఇచ్చినా
రావడం లేదు
రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌పై వ్యవసాయాధికారులకు ఒకరోజు ముందు షెడ్యూల్ వస్తుంది. ఏ టాపిక్‌పై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారో ఏవోలు, ఏఈవోలకు స మాచారం అందుతుంది. రైతులు హాజరయ్యేలా చూడాలని పై అధికారుల ఆదేశాలతో రైతులకు తెలిసేలా సోమవారమే వా ట్సప్ గ్రూపుల్లో, గ్రామ పంచాయతీ మైకుల్లో ప్రచా రం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు వీడియో కాన్ఫరెన్స్‌కు రావడం లేదు. ఇలా చాలా వారాలుగా రైతులు లేక రైతు వేదికలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొందరు ఏఈ వోలు రైతుల దగ్గరకు వెళ్లి బతిమిలాడి పిలుస్తున్నారు. ఎంత చెప్పినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో ఏఈవోలు కూడా మిన్న కుండిపోతున్నారు. వచ్చిన వారితోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రభు త్వం రూ. లక్షలు వెచ్చించి వారానికోసారి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చాలా మంది రైతులు సద్వినియోగం చేసుకోకపోవడం పై వ్యవసాయ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం రైతుల కో సం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి స్పందన కరువైంది. వీడియో కాన్ఫ రెన్స్‌కు హాజరై పంటల సాగుపై శాస్త్రవేత్తలు అందించే సలహాలు, సూచనలు వినడం లేదు. కేవలం వ్యవసాయాధికారులే పాల్గొని వెళ్తున్నారు. రైతులు లేక జిల్లాలోని రైతు వేదికలు బోసిపోతున్నాయి. తద్వారా రైతుల మేలు కోరి ఏర్పాటు చేసిన కార్యక్రమం నీరుగారిపోతోంది. మంగళవారం హై దరాబాద్ నుంచి శాస్త్రవేత్తలు మొక్కజొన్న సాగుపై ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్ప్ ద్వారా సూచనలు చేశారు. జిల్లాలోని పలు రైతు వేదికల్లో రైతుల హాజరును ‘సాక్షి’ పరిశీలించింది. మొత్తం 31 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ జరుగగా మొత్తం 683 మంది రైతులు హాజరైనట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే చాలా వేదికల్లో పదిమంది కూడా హాజరు కాలేదు. కొన్ని చోట్ల వచ్చిన రైతులు హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి కొద్ది సేపటికే వెళ్లిపోయారు. కార్యక్రమం అయిపోయే వరకు అధికారులే ఉన్నారు. రైతుల హాజరును చూపించుకోవడానికి కొంతమంది ఏఈవోలు బోగస్ సంతకాలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతు నేస్తం కార్యక్రమానికి
కరువైన స్పందన
ప్రతి మంగళవారం జరిగే వీడియో
కాన్ఫరెన్స్‌కు హాజరుకాని వైనం
వ్యవసాయాధికారులే పాల్గొంటున్నారు..
ఖాళీగా కనిపిస్తున్న రైతు వేదికలు
Comments
Please login to add a commentAdd a comment