యూరియా కొరత లేదు
సిరికొండ: జిల్లాలో యూరియా కొరత లేద ని, పొలాలకు మూడు దఫాలుగా అవసరమైన యూరియాను ఒకే సారి కాకుండా విడతల వారీగా కొనుగోలు చేయాలని జిల్లా వ్య వసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ అన్నారు. మొక్కజొన్న సాగుపై సిరికొండ రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువులు, పు రుగు మందులను అధిక ధరలకు విక్రయించొద్దని ఆదేశించారు. పంటలకు అవసరమైన మేరకు యూరియాను సొసైటీల్లో, ప్రై వేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. సిరికొండ మండలంలో వరి సాగును ముందస్తుగా ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఆయనవెంట ఏ వో నర్సయ్య, ఏఈవోలు, రైతులు ఉన్నారు.
అల్లకొండ ఖిల్లాకు
మరమ్మతులు చేపట్టండి
ఆర్మూర్: బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పురాతన అల్లకొండ ఖిల్లాకు మరమ్మతులు చేపట్టాలని ఖిల్లా పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషనన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అధ్యక్షుడు మోతె రామాగౌడ్ నాయకత్వంలో అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఆర్డీవోను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అల్లకొండ ఖిల్లా పరిరక్షణ స మితి కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఆర్ న ర్సింగ్‌రావు మాట్లాడుతూ.. పూర్వం 1059 లో అల్లయ్య, కొండయ్య అనే మల్ల యో ధులచే నిర్మితమైన అల్లకొండ పట్టణానికి దేశంలోనే రెండో రాజధానిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయన్నారు. బాల్కొండ ఖిల్లా మరమ్మతుల విషయమై 2024 ఆగస్టులో దేశ ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో రామకృష్ణ తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో రౌడీల పాలన
సుభాష్‌నగర్: రాష్ట్రంలో కొనసాగుతోంది కాంగ్రెస్ ప్రజాపాలన కాదని, రౌడీ పాలన అని నిజామాబాద్ అ ర్బన్ ఎమ్మెల్యే ధన్‌పా ల్ సూర్యనారాయణ మంగళవారం విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. హిసంతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తమ నిరాధారమైన ఆరోపణలకు భౌతికదాడులను జోడించడం దిగజారిన రాజకీయ పద్ధతి అని పేర్కొన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.
దాడులు తెలంగాణ సంస్కృతి కాదు..
తమ పార్టీ రాష్ట్ర కా ర్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తు న్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటే ల్ కులాచారి పేర్కొన్నారు. దాడులు చేయడం తెలంగాణ సంస్కృతి కాదని, దాడిలో బీజేపీ కార్యకర్తల తలలు పగిలాయని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని, దాడి వెనక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె విరమణ
నిజామాబాద్ అర్బన్: డిమాండ్‌ల సాధన కోసం సమ్మె చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు మంగళవారం విరమించారు. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్కతో మంగళవారం చేపట్టిన చర్చలు సఫలం కావడంతో నిరవధిక సమ్మె విరమణ పత్రాన్ని జిల్లా విద్యాశా ఖ అధికారి అశోక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. ఆర్థిక అంశాల ను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment