రేవంత్‌రెడ్డి సమైక్యవాది
నిజామాబాద్ అర్బన్: సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సమైక్యవాది అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి కా రణంగా హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్ములా– ఈ కారు రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఇరికించిందని, క్వాష్ పిటిషన్‌ను హై కోర్టు కొట్టివేయడాన్ని అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కుట్ర పూరితంగానే కేటీఆర్, కేసీఆర్‌ను కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్, బీజేపీ రెండు అధిష్టానాలని, ఆయన అవినీతిపై బీ జేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదని దుష్టపరిపాలన అని అ న్నారు. ఒక్క ఏడాదిలో రూ.లక్షా 24 వేల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, రాంకిషన్‌రావు, సుజిత్‌సింగ్‌ఠాకూర్, ఎస్‌ఏ అలీం పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌కు కాంగ్రెస్, బీజేపీ
రెండు అధిష్టానాలు
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శ
Comments
Please login to add a commentAdd a comment