రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీయే రక్ష..
రాష్ట్రానికి దేశానికి, కాంగ్రెస్ పార్టీయే రక్ష అని, పేదలకు సంక్షేమ పథకాలను అందించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కార్యకర్తల కృషి వల్లే మేమంతా పదవుల్లో ఉన్నామని, రాను న్న స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాను మెయింటెన్ చేయడానికి కేటీఆర్ ప్రతి నెల రూ.కోటి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ, మండల, పురపాలక స్థాయిల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించాలన్నా రు. నాయకులు, కార్యకర్తలకు పట్టువిడుపులు ఉండాలని, అందరినీ కలుపుకుపోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment