ఇండస్ట్రియల్ కారిడార్‌తో వ్యాపార, ఉద్యోగావకాశాలు
నిజామాబాద్ అర్బన్: ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను నగరం చుట్టూ 15 కిలోమీటర్ల లోపు స్థాపించాలని, తద్వారా వ్యాపార, ఉద్యోగ అ వకాశాలు పెరుగుతాయని చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు అన్నారు. జిల్లా అధ్య క్షుడు ఆర్ జగదీశ్వర్‌రావు ఆధ్వర్యంలో మంగళవా రం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతును కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సికింద్రాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్‌ను డ బ్లింగ్ చేస్తూ గుడ్స్ షెడ్ కారిడార్ నిర్మిస్తే వ్యాపార రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. నిజామాబాద్‌లో కంటైనర్ డిపో నిర్మిస్తే ఎగుమతులు సులువవుతుందన్నారు. స్పైస్ బోర్డు ఏర్పాటు తరువాత పసుపు, వరి, తృణధా న్యాలు పండించే రైతులకు అవగాహన సదస్సు లు ఏర్పాటు చేసి పంట దిగుబడులకు మంచి ధర దక్కే లా ప్రయత్నాలు చేయా ల ని కోరారు. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రానికి ఇస్తున్న సబ్సిడీలను నిజామాబాద్‌కి కూడా ఇస్తే ఇక్కడ పరిశ్రమలు వృద్ధి చెందుతాయన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సభ్యులు శ్రీనివాసరావు, గంగాధర్‌రావు, అంబోజి హరిప్రసాద్, జమీల్, పూర్వ అధ్యక్షుడు వెంకటనర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment