‘మహిళా శక్తి’ లబ్ధిదారులను గుర్తించాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ఇందిర మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ కౌంటర్లు, దేశీ కోళ్ల యూనిట్లు, ఇతర ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని మండలాల్లో లబ్ధిదారులను గుర్తించాలని డీఆర్‌డీవో సా యాగౌడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ని జిల్లా కార్యాలయంలో జిల్లా సమాఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. డీఆర్‌డీవో మాట్లాడుతూ.. లబ్ధిదారులను గుర్తించి జాబితాను జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. సెర్ప్ ద్వారా జిల్లాలోని ఎడపల్లి మండలంలో జాన్కంపేట్‌లో రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. డీపీఎంలు సంధ్యారాణి, నీలిమ, సాయిలు, మారుతి, శ్రీనివాస్, సీ్త్రనిధి ఆర్‌ఎం రాందాస్, ఏపీఎం సరోజిని, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు రాధ, లావణ్య పాల్గొన్నారు.
తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబం
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
సుభాష్‌నగర్: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణను దో చుకుందని, అవినీతి ఊబిలో కూరుకుపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లబోనని కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని, ఇంకా కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా, కవిత ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల పాల్జేసి, దశాబ్దాల పాటు అప్పుల నుంచి బయటికి రాకుండా చేశారని విమర్శించారు. వ్యక్తుల కంటే న్యాయం చాలా శక్తివంతమైనదని తెలిపారు. కేటీఆర్ చేసిన ఆర్థిక అవినీతికి శిక్ష తప్పదని, చట్టం ముందు అందరూ సమానులేనని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
9న మైనారిటీ కమిషన్ చైర్మన్ రాక
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ ఈ నెల 9న నిజామాబాద్ పర్యటనకు రానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. మొదట ఈ నెల 7న వస్తారని తెలిపినా.. అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు తెలిసింది. 9న ఉదయం 10:00 గంటలకు కమిషన్ చైర్మన్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మైనారిటీ వర్గాల వారి నుంచి వినతులు స్వీకరిస్తారని అధికారులు తెలిపారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్ల ను పరిశీలించి, సీసీ టీవీలో బ్యాలెట్ యూని ట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, అగ్నిమాపక శాఖ అధి కారి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment