సుభాష్‌నగర్: విద్యుత్ లైన్లకు దూరంగా ఉన్న ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేయాలని టీజీ ఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలు సంతోషంగా పతంగులు ఎగురవేస్తారని సురక్షిత ప్రాంతాలను ఎంచుకోవడం శ్రేయస్కరమన్నారు. గాలిపటాలు ఎగుర వేసే వారికి విద్యుత్ శాఖ పలు సూచనలు చేసిందన్నారు.
● విద్యుత్ లైన్లకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో గాలిపటాలు ఎగురవేయాలి.
● విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్ల వద్ద ఎగురవేయడం ప్రమాదకరం. పతంగులు, మాంజాలు విద్యుత్ లైన్లపై పడితే సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
● మాంజాదారంతో ప్రమాదం పొంచి ఉంది. కరెంటు తీగలకు తాకినా మాంజా తెగిపోదు. దీంతో విద్యుత్ లైన్లు బ్రేక్ డౌన్ అయ్యే అవకాశముంది.
● గాలిపటం కరెంటు తీగలకు చిక్కుకుంటే దానిని తీసే ప్రయత్నం చేయొద్దు.
● గాలిపటాలు, మాంజాలు లైన్లపై, విద్యుత్ పరికరాలపై పడితే వాటిని వదిలేయాలి. ఒకవేళ వాటిని పట్టుకొని లాగితే విద్యుత్ తీగలు ఒక దానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరుగుతుంది.
● బాల్కనీ, గోడలు, ప్రహరీ లేని భవంతులపై గాలిపటాలు ఎగురవేయవద్దు.
● విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడితే వెంటనే సమీప విద్యుత్ కార్యాలయానికి సమాచారమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో తెగి పడిన విద్యుత్ తీగలను తాకకుండా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు తెలియజేయాలి.
విద్యుత్ లైన్లకు దూరమైన ప్రాంతాలను ఎంచుకోవాలి
కరెంట్ వైర్లు తెగి పడితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారమివ్వాలి
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్
Comments
Please login to add a commentAdd a comment