సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
బాన్సువాడ : రబీ పంటల సాగును దృష్టిలో ఉంచు కుని నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ సలహదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్కొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి, పంటలకు కావాల్సిన సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకునేలా చూడాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకుంటే మిగిలిన నిజాంసాగర్ నీటితో వచ్చే ఖరీఫ్‌లో నారుమడులు వేసుకోవచ్చన్నారు. సమావేశంలో బాన్సువాడ, బోధన్ సబ్ కలెక్టర్లు కిరణ్మ యి, వికాస్ మహతో, నిజాంసాగర్ ప్రాజెక్టు సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ బలరాం, డీఈ లు జగదీష్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment