రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం

Published Mon, Jan 6 2025 7:31 AM | Last Updated on Mon, Jan 6 2025 7:31 AM

రైతు

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం

నవీపేట: రైతు శ్రేయస్సుకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇస్తుందని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాళేశ్వర్‌, లింగాపూర్‌ గ్రామాల్లో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఎరువుల గోదాములను సుదర్శన్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగాదాయన మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రూ.2 లక్ష ల రుణమాఫీ వర్తించలేదన్నారు. లోపాలను సవరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని, త్వరలో అందరికీ రుణమాఫీ వస్తుందని హామీ ఇచ్చారు. నాళేశ్వర్‌ గ్రామ శివారులోని పురాతన రాజరాజేశ్వరాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరు చేస్తానన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాంచందర్‌, బినోల సొసైటీ చైర్మన్‌ మగ్గారి హన్మాండ్లు, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, రాజేంద్రకుమార్‌గౌడ్‌, మహిపాల్‌రె డ్డి, మాణికేశ్వర్‌రావు, బాల్‌రాజ్‌గౌడ్‌, బాబ ర్‌, విజయ్‌, నర్సింగ్‌రావ్‌ పాల్గొన్నారు.

అంతర్జాతీయ సదస్సులో గుంజీళ్ల మాస్టార్‌

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఉత్తరప్రదే శ్‌ రాష్ట్రం ప్రయాగరాజ్‌లోని నార్త్‌ సెంట్రల్‌ జోన్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న గ్లో బల్‌ ఆయు ష్‌ మహాకుంభ్‌ అంతర్జాతీయ సదస్సులో జిల్లాకు చెందిన అందె జీవన్‌రావు పాల్గొన్నా రు. సంజీవిని వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో గుంజీళ్ల మాస్టారుగా ప్రసిద్ధిగాంచిన జీవన్‌రావు పాల్గొని ‘కృత్రిమ మేధతో కూడిన సూపర్‌ బ్రెయిన్‌ యోగా– మెరుగైన /్ఞాపకశక్తి, స మాజ క్షేమం’ అంశంపై తన పరిశోధనా ప త్రాన్ని సమర్పించారు. పరిశోధనా వివరాల ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కృత్రిమ మేధను సూపర్‌ బ్రె యిన్‌ యోగాతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించొచ్చని ఆయన వివరించారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌ సంజీవని వెల్ఫేర్‌ సొసైటీ నిర్వాహకు లు జీవన్‌రావును ఘనంగా సన్మానించారు.

నేడు బీఆర్‌ఎస్‌ నిరసనలు

నిజామాబాద్‌ అర్బన్‌: రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేయడాన్ని ఎండగడు తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సోమవారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పుకుంటూ ఎన్నికల హా మీలను అమలు చేయకుండా కపటనీతిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని, కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన రైతాంగానికి సంఘీభావంగా జరగనున్న నిరసన కార్యక్రమాలలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

చైనా మాంజా పట్టివేత

ఖలీల్‌వాడి: నగరంతోపాటు ఆర్మూర్‌ పట్టణంలోని గా లిపటాల దుకాణాలపై ఆదివారం టా స్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పోలీసులు దాడులు నిర్వహించి, నిషేధి త చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నా రు. నగరంలోని పెద్దబజార్‌లోగల పతంగుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేయ గా ఒక షాపులో నాలుగు బెండల్స్‌ చైనా మాంజాను పట్టుకోగా దాని విలువ రూ. 4వేలు ఉన్నట్లు రెండో టౌన్‌ ఎస్సై యాసీన్‌ ఆరాఫత్‌ తెలిపారు. మరో షాపులో 5 బెండల్స్‌ దొరుకగా రూ.5వేలు విలువ ఉన్నట్లు తెలిపారు. సంబంధిత షాపు యజమాను లపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే ఆర్మూర్‌లోని ఓ దుకాణంలో తనిఖీలు చేసి ఆరు బెండళ్ల చైనా మాంజాను పట్టుకున్నామని, దాని విలువ సుమారు రూ.6వేలు వరకు ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ సీఐ అంజయ్య తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌కు అప్పగించినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతు శ్రేయస్సే  కాంగ్రెస్‌ లక్ష్యం 1
1/2

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం

రైతు శ్రేయస్సే  కాంగ్రెస్‌ లక్ష్యం 2
2/2

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement