10 రోజులు 9 టీఎంసీలు!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్‌కు పది రోజుల్లో 9 టీఎంసీల నీటి వినియోగం పూర్తయ్యింది. గత నెల 25 నుంచి కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదలను చేపట్టారు. మొదటి రెండు రోజులు తక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసినప్పటికీ.. ఆ తరువాత రోజుకు టీఎంసీ చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 11,305 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కనీసం మరో 110 రోజులపాటు నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ఈ లెక్కన 100 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 71.5 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. నీటి వినియోగం ఇలాగే ఉంటే సీజన్ చివరలో పంటలకు నీరందకుండాపోయే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్ట్ అధికారులు ప్రతి నీటి బొట్టు సద్వినియోగమయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొనసాగుతున్న నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5 వేలు, సరస్వతి కాలువ ద్వారా 700, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, అలీసాగర్ లిఫ్ట్‌కు 463 క్యూసెక్కులు, గుత్ప లిఫ్ట్‌కు 186, ముంపు గ్రామాల ఎత్తిపోతల పథకాలకు 312, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 425 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1088.30(71.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
యాసంగి సీజన్‌కు ఎస్సారెస్పీ
నీటి వినియోగం
వేసవిలో మరింత పెరిగే అవకాశం
రోజుకు 11,305 క్యూసెక్కుల అవుట్ ఫ్లో
Comments
Please login to add a commentAdd a comment