● మేము ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఫోన్ నంబర్‌ను చట్టవిరుద్దమైన కార్యకలపాలకు వాడుతున్నారు. మీ నంబర్ నిలిపివేస్తున్నామని భయపెడతారు. కానీ ట్రాయ్ నిబంధనల మేరకు సెల్ నంబర్‌ను నిలిపివేసే అవకాశం లేదు.
● మీ పేరుపై పార్సిల్ వచ్చింది. ఇందులో అక్రమంగా తీసుకొచ్చిన వస్తువులు, డ్రగ్స్ ఉన్నాయని భయపెడతారు. క్రిమినల్ కేసులు అవుతాయని, డబ్బులు ఇచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతారు. కస్టమ్స్, ఎయిర్‌ఫోర్స్, పోలీసులు, ఎకై ్సజ్ వివిధ రకాల పేర్లు చెబుతారు. కానీ ప్రజలు అధికారిక వెబ్‌సైట్లు, సంబంధిత అధికారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకోవాలి
● మీ కుటుంబసభ్యుడు కేసులో ఇరుక్కున్నాడు. అరెస్ట్ చేయబోతున్నామంటూ పూర్తి వివరాలు తెలుపుతూ భయపెడతారు. ఇలాంటి వాటిని నమ్మొద్దు.
● స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని వల వేస్తారు. కానీ సెబీ రిజిస్ట్రేషన్ ఉన్న ఏజెంట్లను మాత్రమే నమ్మాలి.
● ఇంటి వద్ద నుంచే ఉద్యోగం(వర్క్ ఫ్రం హోమ్) కల్పిస్తామని, బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ తీసుకుని డబ్బులు ట్రాన్జక్షన్ చేస్తే ఒక్కో ట్రాన్జక్షన్‌కు కొంత చెల్లిస్తానని నమ్మిస్తారు. వారి మాటలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. నమ్మితే క్రిమినల్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంటుంది.
● పొరపాటున మీ అకౌంట్‌లోకి డబ్బులు వేశామని అపరిచితులు ఫోన్ చేస్తే స్పందించొద్దు.
● క్రెడిట్ కార్డులు, లోన్‌ల మంజూరు పేరుతో కాల్స్ వస్తే స్పందించొద్దు.
● కేవైసీ గడువు ముగిసింది. దానిని పునరుద్ధరించుకువాలని నమ్మించి లింక్ పంపిస్తారు. అటువంటి లింక్‌లను ఓపెన్ చేయొద్దు.
● పోలీసుల పేరు చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలి.
● టాక్స్ అధికారులమని, మీకు పెద్ద మొత్తంలో రీఫండ్ వస్తుందని బ్యాంక్ వివరాలను కోరతారు. వాటికి స్పందించవద్దు. మీ దగ్గరలోని ఇన్‌కమ్‌టాక్స్ అధికారులను సంప్రదించాలి. లేకుంటే టాక్స్ కన్సల్టెంట్‌ను కలవాలి.
Comments
Please login to add a commentAdd a comment