నేటి నుంచి రైల్వే గేట్ మూసివేత
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ – మోస్రా రో డ్డులో హనుమాన్ టేక్డి కాలనీ వద్ద ఉన్న రై ల్వేగేట్‌ను శుక్రవారం నుంచి ఆదివారం మూసివేయనున్నట్లు బోధన్ స్టేషన్ మాస్టర్ రాము తెలిపారు. గేటు వద్ద మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గేటు మూసివేస్తామని, బోధన్ నుంచి బెల్లాల్, ఊట్‌పల్లి, మో స్రా వైపు వెళ్లే వాహనదారులు రాకాసీపేట్ మీదుగా, అటువైపు నుంచి బోధన్ వైపునకు వచ్చేవారు ఎరాజ్‌పల్లి మీదుగా రావాలన్నారు.
రేపు చెరుకు రైతులతో
సమావేశం
ఎడపల్లి/బోధన్: మూతపడిన నిజాం దక్క న్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్‌ఎల్)ను రాష్ట్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో చెరుకు సాగు అంశంపై చ ర్చించేందుకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఈ నెల 4న రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎడపల్లిలోని సరయూ ఫంక్షన్ హాలులో మ ధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కాను న్న సమావేశానికి రాష్ట్ర షుగర్ కేన్ కమిషన ర్, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు హాజరు కానున్నారు. చెరుకు సాగును ప్రొ త్సహించేందుకుగాను రైతులకు అవగాహన కల్పించే లక్ష్యంతో సమావేశం ఏర్పాటు చే యడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. స మావేశానికి రైతులు అధిక సంఖ్యలో రావా లని ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ కోరారు.
పోస్టర్ల ఆవిష్కరణ
ఖలీల్ వాడి : జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జాతీయ రహదారి భద్రతా మా సోత్సవాల పోస్టర్లను గురువారం కలెక్టర్ రా జీవ్ గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీటీవో ఉమామహేశ్వరరా వు, ఎంవీఐ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రైవేట్ వెంచర్‌లో దేవాదాయ
శాఖ భూముల గుర్తింపు
మాక్లూర్ : మాక్లూర్ మండలం మానిక్‌బండార్ శివారులోని ప్రైవేటు వెంచర్‌లో కబ్జాకు గురైన దేవాదాయ శాఖకు చెందిన భూమిని అధికారులు గుర్తించి గ్రామస్తులకు హద్దులు చూపించారు. సుమారు 217 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన వెంచర్లో యజమానులు అనే క అక్రమాలకు పాల్పడ్డారని స్థానిక కార్పొరేటర్ రాయ్ సింగ్ ఏడాది కాలంగా అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఈ అక్రమాలపై ‘సాక్షి’ లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన అధికారులు విచారణ ప్రారంభించారు. గురువారం నాటితో మూడు దఫాలుగా సర్వే చేశారు. సర్వే నంబర్ 499లో 30 గుంటలు, 480లో 14 గుంటలు, 477లో 2ఎకరాల 5గుంటలు, 503లో 19 గుంటలు, 548లో 29 గుంటలు దేవాదా య శాఖకు చెందిన భూమిగా గుర్తించారు. గ్రామస్తులు హద్దులు పోతున్నారు. తహసీ ల్దార్ అధికారికంగా ఇచ్చిన సర్వే పత్రం ఆ ధారంతో భూమిని స్వాధీనం చేసుకుంటా మని కార్పొరేటర్ రాయసింగ్ వెల్లడించారు. ఈ సర్వేలో దేవాదాయ శాఖ ఇన్‌చార్జి అసి స్టెంట్ కమిషనర్ శ్రీరామ్ రవీందర్, జూనియర్ అసిస్టెంట్లు సుమన్, లక్ష్మణ్, సర్వేయ ర్ శ్రీను నాయక్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ షఫీ, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రభు, న ర్సాగౌడ్, గోవర్ధన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
న్యాల్‌కల్ రోడ్డులో..
నిజామాబాద్ రూరల్: నగరంలోని న్యాల్‌క ల్ రోడ్డులో ఉన్న ఆర్టీసీ డిపో వెనుకాల ఉన్న ఆలయ మాన్యం భూమిని దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు గురువారం సర్వే చేశారు. సర్వే నంబర్ 1491లో 4 ఎకరాల 22 గుంటలు, 1492లో ఒక ఎకరం 8 గుంటలు, 1495లో ఒక ఎకరం 25 గుంటలు, 1496లో ఒక ఎకరం 36 గుంటలు భూమి ఉందని, హద్దులు గుర్తించామని స ర్వే అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్ శ్రీరాంరవీంద ర్, సర్వే అధికారి ఎంఏ సయీద్, దేవాదా య, ధర్మాదాయ పరిశీలకులు బి కమలతో పాటు వివిధ ఆలయాల ఈవోలు వేణు, రాములు, అధికారులు ప్రశాంత్‌కుమార్, ఆంజనేయులు, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment