నిలిచిన బియ్యం సరఫరా!
● నిరవధిక సమ్మెలోకి సివిల్
సప్లయీస్ హమాలీలు
● ఎక్కడి లారీలు అక్కడే..
మూతబడిన ఎంఎల్‌ఎస్ పాయింట్లు
● 40 శాతం రేషన్ దుకాణాలకు మాత్రమే చేరిన బియ్యం●
● వసతి గృహాలు, అంగన్‌వాడీ
కేంద్రాల్లో నిండుకున్న నిల్వలు
సుభాష్‌నగర్: సివిల్ సప్లయీస్ హమాలీల సమ్మె కారణంగా జిల్లాలోని రేషన్ దుకాణాలు, వసతిగృహాలు, అంగన్‌వాడీలు, రెసిడెన్షియల్స్సు బియ్యం సరఫరా నిలిచిపోయింది. డిసెంబర్ 31వ తేదీ వర కు కేవలం 40 శాతం రేషన్‌దుకాణాలకు మాత్రమే పీడీఎస్ బియ్యాన్ని సరఫరా చేశారు. పెరిగిన హమాలీ రేట్ల జీవోను విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో గత డిసెంబర్ 18న కమిషనర్ కార్యాలయా న్ని ముట్టడించారు. అదేరోజున సమ్మె నోటీ సు సైతం అందజేశారు. హమాలీల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా పీడీఎస్ బియ్యం సరఫరా చేసే లారీలు ఎక్క డికక్కడ నిలిచిపోగా ఎంఎల్‌ఎస్ పాయింట్లు మూతపడ్డాయి.
8 పాయింట్లు.. 104 మంది హమాలీలు
జిల్లాలో 8 ఎంఎల్‌ఎస్ పాయింట్లు (గోదాములు) ఉన్నాయి. ప్రతినెలా ఈ పాయింట్ల నుంచే రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీలు, రెసిడెన్షియల్స్, పాఠశాలలకు బియ్యం సరఫరా అవుతుంది. సుమారు 8వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతుండగా, ఆ యా పాయింట్లలో 104 మంది హమాలీలు, 8 మంది (పాయింట్‌కు ఒకరు చొప్పున) స్వీపర్లు పని చే స్తున్నారు. ప్రతినెలా 18 నుంచి 30 వరకు రేషన్ దుకాణాలకు, 5నుంచి స్కూళ్లు, అంగన్‌వాడీలు, రెసిడెన్షియల్స్‌కు బియ్యం సరఫరా చేస్తారు.
నాలుగైదు రోజులకే..
జిల్లాలోని 751 రేషన్‌దుకాణాలు, సుమారు వెయ్యికిపైగా స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం, 1500 వర కు అంగన్‌వాడీలు, 100 వరకు వివిధ రకాల హాస్ట ళ్లు, రెసిడెన్సియళ్లకు హమాలీల సమ్మె వల్ల బియ్యం సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే రేషన్‌దుకాణాల వద్దకు కార్డుదారులు వచ్చి వెళ్తుండగా, స్కూళ్లు, హాస్టళ్లు, రెసిడెన్సియళ్లు, అంగన్‌వాడీల్లో బియ్యం నిల్వలు నిండుకున్నాయి. మరో నాలుగైదు రోజుల కు సరిపడా మాత్రమే బియ్యం ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది.
నిరవధిక సమ్మె
పెరిగిన హమాలీ రేట్ల జీవో విడుదల చేయాల ని సివిల్ సప్లయీస్ హమాలీలు, స్వీపర్లు సమ్మె చేస్తున్నారు. క్వింటాల్ బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ చేస్తే హమాలీలకు రూ.26 చెల్లిస్తు న్నా రు. అయితే ప్రభుత్వం, కమిషనర్ చౌహాన్, యూనియన్ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో హమాలీలకు క్వింటాల్‌కు రూ.29, స్వీపర్లకు రూ.వెయ్యిచొప్పున (గోదాం సామర్థ్యం బట్టి) పెంచేందుకు అక్టోబర్ 4న ఒప్పందం కుదిరింది. 2024 జనవరి 1 నుంచి పెరిగిన ఏరియర్స్ చెల్లించాలని ఒప్పు కున్నప్పటికీ జీవో విడుదల కాలేదు. హమాలీలు డిసెంబర్ 18న కమిషనర్ కార్యాలయం ముట్టడించగా,వారంలోపు జీవో విడుదల చేస్తామని జీఎం ప్రకటించారు. జీవో విడుదల కాకపోవడంతో హమాలీలు ఈనెల 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment