విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ఖలీల్‌వాడి: విద్యార్థులు గంజాయి, డ్ర గ్స్‌కు దూరంగా ఉండాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి సూచించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా శనివారం ఉమ్మడి జిల్లాస్థాయి క్విజ్ పోటీలను నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని 71 స్కూళ్ల నుంచి 552 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళ్లాలన్నారు. అనంతరం ప్రిలిమ్స్ ప్రతిభ చూపిన 12 మంది విద్యార్థులకు ఫైనల్ క్విజ్ నిర్వహించారు. ఫైనల్‌లో నిజామాబాద్ జిల్లా బన్సాల్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు దినేష్ కుమార్, అభయ్ వివేక్ సిద్ధార్థ ప్రథమ, ముబారక్ నగర్ విజయ పాఠశాల విద్యార్థులు తరుణ్, శరణ్ తేజ్ ద్వితీయ స్థానం, ధర్పల్లికి చెందిన లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఆర్ వినయ్ కుమార్, బి లోకేష్ తృతీయ బహుమతులు గెలిచారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఆశోక్, డాక్టర్ విశాల్, ఎకై ్సజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి, హనుమంతురావు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏడీ చంద్రబానునాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment