రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
నిజామాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవాలపై శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులతో మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులతో మండల కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టాలన్నారు. పోలీస్, విద్యా శాఖ, ఆర్ అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమలను సామజిక మాధ్యమాల ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగన ప్రాంతాల్లో బస్సుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందేలా చూడాలన్నారు. హాస్టళ్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు పంపిణి చేసే కాంట్రక్టులకు బిల్లుల త్వరగా మంజూరు చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, శిక్షణ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీటీసీ దుర్గ ప్రమీల, బీసీ సంక్షేమ శాఖ అధికారి స్రవంతి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment