ప్రకృతి అందాల నెలవు
అరణ్య అర్బన్ పార్క్
నిజామాబాద్ నగర సమీపంలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ గండి అటవీ ప్రాంతంలో నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. 460 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్‌లో ఏపుగా పెరిగిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాగి, మర్రి, వేప, అల్లనేరేడు, వెదురు, నల్లమద్ది, తెల్ల మద్ది తదితర రకాల 90 వేల చెట్లు పెంచారు. సెలవు రోజుల్లో అడవి అందాలను వీక్షించేందుకు స్థానికులే గాకుండా పక్క జిల్లాల్లోని పర్యాటకులు వందల సంఖ్యలో తరలివస్తున్నారు. స్కూలు పిల్లలకు మంచి పిక్నిక్ స్పాట్‌గా మారింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్‌లు జరుగుతున్నాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
8లో
Comments
Please login to add a commentAdd a comment