జిల్లాను ముందంజలో నిలుపుదాం
నిజామాబాద్‌అర్బన్: నూతన సంవత్సరంలో మ రింత ప్రగతి సాధించి జిల్లాను ముందంజలో నిలుపుదామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అ న్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా యంలోని తన చాంబర్‌లో కలెక్టర్‌ను గురువారం ఆ యా శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కలిసి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ నేతత్వంలో ఆఫీసర్స్‌క్లబ్ కార్యవర్గం, రెడ్‌క్రాస్ సొసైటీ, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధు లు, బ్రహ్మకుమారీలు తదితరులు కలెక్టర్‌ను కలిశా రు. బహుతులుగా వచ్చిన నోట్ పుస్తకాలు, పెన్ను లు, దుప్పట్లను సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment