స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
బోధన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్న ద్ధం కావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్ ని యోజక వర్గ బీఆర్‌ఎస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. వార్డు స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మ రింత పటిష్టం చేసుకోవాలన్నారు. గురువారం హై దరాబాద్‌లోని తన నివాసంలో బోధన్ నియోజక వర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆ మె సమావేశం నిర్వహించారు. కవిత మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హా మీలను నెరవేర్చడంలో విఫలమైందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నా రు. పార్టీ నియోజక వర్గ ముఖ్య నాయకులు కొంద రు మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయాక కొందరు పార్టీలు మారారని, ఈ పరి స్థితుల్లో వార్డు స్థాయి పార్టీ కమిటీలను నియమించాల్సిన అవసరం ఉందని కవిత దృష్టికి తీసుకెళ్లా రు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సుదీ ర్ఘకాలం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత పార్టీకి ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, పార్టీ నాయకులు అయేషా ఫాతిమా, వీఆర్ దేశాయ్, గి ర్దావర్ గంగారెడ్డి, రవి కిరణ్, మాజీ ఎంపీపీ శ్రీనివా స్, నర్సింగ్‌రావు, గోగినేని నర్సయ్య పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ శ్రేణులకు ఎమ్మెల్సీ
కవిత దిశానిర్దేశం
బోధన్ నియోజక వర్గ పార్టీ
నాయకులతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment