నత్తనడకన పశుగణన
డొంకేశ్వర్(ఆర్మూర్): కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 21వ అఖిత భారత పశుగణన జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రెండు నెలల క్రితం సర్వేను ప్రారంభించిన పశువైద్య ఉద్యోగులు ఇప్పటి వరకు కేవలం 35 శాతం మాత్రమే సర్వేను పూర్తి చేశారు. ఫిబ్రవరి 28నాటికి సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. రెండు నెలల్లో కనీసం 50శాతాన్ని అధిగమించకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లాలో 31 మండలాల్లో 545 గ్రామ పంచాయతీలు ఉండగా 421 గ్రామ పంచాయతీల్లోనే పశుగణన సర్వే నడుస్తోంది. మిగతా గ్రామాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. పశు గణన కోసం మొత్తం 109మంది ఎన్యురేటర్లను నియమించారు. సర్వేను పరిశీలించడానికి 23మంది పర్యవేక్షకులను నియమించినప్పటికీ పశుగణనలో వేగం కనిపించడం లేదు. పర్యవేక్షుల పాత్ర పేరుకే పరిమితమైంది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి చేయాల్సిన సర్వేను నిర్లక్ష్యం చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంతో సర్వే మరింత జాప్యం అవుతోంది.
‘పశుధన్’ యాప్‌లో నమోదు
సంక్షేమ పథకాల రూపకల్పన చేయడానికి కేంద్ర ప్రభుత్వం పశు గణనను ప్రతీ ఐదేళ్లకోసారి నిర్వహిస్తోంది. దీని ద్వారా పశుపోషకుల ఆర్థిక పరిపుష్టిని అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. చివరిసారిగా 201819లో సర్వే జరిగింది. ‘పశుధన్’ యాప్ ద్వారా ఆన్‌లైన్ సర్వే చేపట్టడం ఇదే మొదటిసారి. పెన్ను, పేపర్ లేకుండా ఫోన్ ద్వారా సర్వే చేస్తున్నప్పటకీ ఇందులో వేగం కనిపించడం లేదు. ఈ పశుగణన సర్వేలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలు, పందులు, కుందేళ్లు, గుర్రాలు, బాతులు, పిల్లులు ఇలా మొత్తం 16 జంతు జాతులకు సంబంధించిన పశువుల లెక్కలు అధికారులు సేకరిస్తున్నారు. యజమానులు పెంచుకునే పశువులు, జంతువులే కాకుండా వీధి కుక్కలు, వీధి పశువుల లెక్కలు కూడా తీస్తున్నారు. సర్వేకు వైద్య అధికారులు సరిపోకపోవడంతో గోపాల మిత్రల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇంటింటికీ తిరిగి ఇంటి యజమాని పేరుతో పాటు పశువులు, జంతువులు వాటి రకాలు, సంఖ్యను నమోదు చేస్తున్నారు.
2018–19 సర్వే ప్రకారం జిల్లాలో పశువుల సంఖ్య
సర్వేను జాప్యం చేస్తున్న పశువైద్య
ఉద్యోగులు
జిల్లాలో ఇప్పటి వరకు 35 శాతమే పూర్తి
పేరుకే పర్యవేక్షకుల పాత్ర
పశువైద్య ఉద్యోగులతో జేడీ సమీక్ష
రెండు నెలల కిందట మొదలై, నెమ్మదిగా సాగు తున్న పశు గణన సర్వేను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. సర్వేను పూర్తి చేయడానికి మరో 56 రోజులు మాత్రమే గడువు ఉంది. ఐతే, సర్వేను వేగిరం చేసేందుకు శుక్రవారం జిల్లా కార్యాలయంలో పశువైద్య ఉద్యోగులతో ఆ శాఖ జేడీ జగన్నాథచారి సమావేశం నిర్వహించారు. వెనుకబడిన మండలాలపై సమీక్షించి పశుగణను త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులకు ఆదేశాలిచ్చారు. అలాగే లక్ష్యం మేరకు పశువులకు టీకాలను పూర్తి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment