యూరియా కోసం బారులు
ధర్పల్లి: ధర్పల్లి సొసైటీ పరిధిలోని దుబ్బాక గోదాం వద్ద రైతులు యూరియా బస్తాల కోసం శుక్రవారం ఉదయం బారులు తీరారు. కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సొసైటీ గోదాం వద్ద ఇస్తారని తెలియడంతో ఉదయమే చేరుకొని లైన్‌లో బండరాళ్లు, పట్టా పాస్‌బుక్‌లు పెట్టారు. యూరియా బస్తాలు దొరకక ప్రైవేట్ దుకాణాల్లో తెచ్చుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతపై మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్‌ను వివరణ కోరగా.. దుబ్బాకలోని సొసైటీ గోదాంలో 40 టన్నుల యూరియాను శుక్రవారం పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో యూరియా కొరత లేదన్నారు. ధర్పల్లి, రామడుగు, హోన్నాజిపేట్ సొసైటీల్లో యూరియా స్టాక్ ఉందని రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment