విధుల్లో క్రమశిక్షణ ముఖ్యం
డిచ్‌పల్లి: పోలీసు విధుల్లో క్రమశిక్షణ ముఖ్యమని నిజామాబాద్ ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ అన్నారు. డిచ్‌పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 463 మంది కానిస్టేబుళ్లకు శుక్రవారం ‘దీక్షాంత్ పరేడ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్‌చార్జి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ ఫైరర్ (జి శివకృష్ణ), బెస్ట్ అవుట్ డోర్ అండ్ ఆల్‌రౌండర్ (బి రవి), బెస్ట్ ఇండోర్ (కె నవీన్‌కుమార్ రెడ్డి), పరేడ్ కమాండర్ (జి నిరంజన్‌రెడ్డి)కు కమాండెంట్ సత్యనారాయణతో కలిసి బహుమతులు అందజేశారు. శిక్షణ అందించిన పోలీసు, వైద్య సిబ్బందికి ప్రశంసపత్రాలు అందించారు. ఈ సందర్భంగా సింధుశర్మ మాట్లాడుతూ.. అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీసు సేవలో ప్రతిఒక్కరూ అంతర్భాగమేనని, వ్యవస్థలో విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం అవసరమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లలో రాచకొండ కమిషనరేట్, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎంపికైన వారు ఉన్నట్లు తెలిపారు. పోలీస్ శా ఖలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది పా త్ర ఎంతో ముఖ్యమైందన్నారు. కమాండెంట్ సత్య నారాయణ మాట్లాడుతూ.. 2002 లో బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్‌గా గుర్తింపు పొందిందని తెలిపా రు. ఇప్పటి వరకు 14 బ్యాచ్‌లకు శిక్షణ పూర్తి చేయ డం గర్వకారణమన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆర్‌ఐ త్రిముఖ్ ఆధ్వర్యంలో 53 మంది అవుట్‌డోర్, ఆరు గురు ఇండోర్ ఫ్యాకల్టీ శిక్షణనిచ్చినట్లు తెలిపారు. అంతకుముందు ఇన్‌చార్జి సీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అసిస్టెంట్ కమాండెంట్స్ కేపీ శరత్‌కుమార్, కేపీ సత్యనారాయణ, ఏవో టి అయ్యవారయ్య, మెడికల్ ఆఫీసర్ అనుపమ పాల్గొన్నారు.
నిజామాబాద్ ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ
బెటాలియన్‌లో ఘనంగా దీక్షాంత్ పరేడ్
శిక్షణ పూర్తి చేసుకున్న 463 మంది
కానిస్టేబుళ్లు
Comments
Please login to add a commentAdd a comment