అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి కృషి
నిజామాబాద్ అర్బన్: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే కృషి చేశారని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులు అర్పించారు. అదనపు కలెక్ట ర్ మాట్లాడుతూ.. తన భర్త జ్యోతిరావు పూలే ప్రో త్సాహంతో సావిత్రిబాయి చదువుకొని ఉపాధ్యా యురాలు అయ్యారన్నారు. విద్యతోనే సీ్త్ర విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించా రని తెలిపారు. ఆ మహనీయురాలి స్ఫూర్తితో మహి ళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపా ధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయినులుగా ఎంపికై న సాలూర ఎంఈవో మంజూష, వేల్పూర్ ఎంఈవో రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీడీ సంధ్యారాణి, నాగారం ఉర్దూ మీ డియం రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండ జ్యోతిబాపూలే బాలికల పాఠశాల ఉపాధ్యాయిని ఎల్ ఉమాదేవి, జూనియర్ లెక్చరర్ నూరున్నీసా బేగం, జాతీయ అవార్డు గ్రహీత విజయలక్ష్మి, రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన స్వరూపలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అంకిత్
Comments
Please login to add a commentAdd a comment