పడిపోయిన టమాట ధర
● హాల్‌సేల్‌లో కిలో రూ.6
పలుకుతున్న వైనం
● ఆందోళన చెందుతున్న రైతులు
నిజామాబాద్ రూరల్: టమాట ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల క్రితం వరకు కిలో రూ.40 పలికిన టమాట ప్రస్తు తం రూ.10కి పడిపోయింది. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.ఆరుకే ఇస్తున్నారు. దీంతో టమాట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ట మాట తెంపిన కూలి కూడా గిట్టుబాటు కావ డం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లోకి టమాట పంట ఒక్కసారిగా రావడంతో డిమాండ్ తగ్గి రేటు పడిపోయింది. నగరంలో 20 కిలోల బాక్స్‌ను రూ.120కి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వారు మార్కెట్‌లో కిలో రూ.8 నుంచి రూ.10వరకు విక్రయిస్తున్నారు. దీంతో ఏమి మిగలడం లేదని వారు వాపోతున్నారు. కాగా ఫిబ్రవరి, మార్చిలో టమాటలకు డిమాండ్ ఉంటుందని వారు చెబుతున్నారు. అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment