ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తాం
ఎస్సీ వర్గీకరణపై అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వానికి సమగ్ర వివేదిక అందజేస్తామని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ పేర్కొంది.
ఈ సందర్భంగా షమీమ్ అక్తర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని, క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కలుపుకుని ఇప్పటివరకు 9 జిల్లాల్లో అభిప్రాయ సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. వర్గీకరణ అంశంతోపాటు సామాజిక స్థితిగతులకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు చెందిన అన్ని వర్గాలవారు ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్భయంగా కమిషన్‌కు తమ అభిప్రాయాలను వెల్లడించొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment