విషాహారంతో 50 కోళ్లు మృతి
డొంకేశ్వర్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లపై విష ప్రయోగం చేశారు. విషం కలిపిన బియ్యం తిని 50 పైగా కోళ్లు, ఒక మేక మృతి చెందాయి. మోతె చిన్న సాయన్న, చాకలి రాజన్నలకు చెందిన కోళ్లు భారీ సంఖ్యతో మరణించాయి. గొల్ల సాయిలుకు చెందిన ఒక మేక పిల్ల కూడా చనిపోయింది. కావాలనే కోళ్లపై విష ప్రయోగం చేశారని కోళ్ల పెంపకం దార్లు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే చేశారని, వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సుమారు రూ.50వేల నష్టం జరిగిందని వాపోయారు. కోళ్లు, మేకపిల్ల మృతి చెందిన ఘటనపై మండల పశువైద్య అధికారి శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. గురువారం గ్రామానికి వచ్చి చనిపోయిన కోళ్లను పరిశీలించి అవసరమైతే పరీక్ష చేసేందుకు ల్యాబ్‌కు పంపుతామని అధికారి తెలిపారు.
డొంకేశ్వర్ మండలం
గంగాసముందర్‌లో విష ప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment