ఖలీల్‌వాడి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. డిసెంబర్ 30, 31 రెండు రోజుల్లో మద్యం ప్రియు లు తెగతాగేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగా మద్యం విక్రయాలు సాగినట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాలో 102 వైన్స్‌లు, 17 బార్‌లు ఉండగా, సోమ, మంగళవారాల్లో మద్యం విక్రయాల ద్వారా ఎకై ్సజ్‌కు రూ.25.10 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31న వైన్ షాపులు రాత్రి 12గంటల వరకు, బార్‌లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 30న లిక్కర్ 11వేల కేస్‌లు, బీర్లు 5,500 కేస్‌లు అమ్ముడుపోగా, రూ.11కోట్ల ఆదా యం వచ్చింది. డిసెంబర్ 31 మంగళవారం రావ డం ఎకై ్సజ్ శాఖకు కలిసి వచ్చింది. 7,500 కేస్‌ల బీ ర్లు, 14వేల కేస్‌ల లిక్కర్ అమ్ముడుపోగా రూ.14.10 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. గతేడాది ఎకై ్సజ్ శాఖకు రూ.9.20 కోట్ల ఆదాయం సమకూరగా, గతేడాదితో పోలిస్తే రూ.4.90 కోట్ల ఆదాయం ఎక్కవుగా వచ్చింది.
వాహనాల తనిఖీ
నగరంలో 20 బృందాలతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మంగళవారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు 37 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.
న్యూఇయర్ జోష్
జోరుగా మద్యం విక్రయాలు
మటన్, చికెన్, చేపలు తదితర
వ్యాపారాలు రూ.5 కోట్లు
నగరంలో 37 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
నాన్‌వెజ్ అమ్మకాలు
జిల్లాలో డిసెంబర్ 31 దావత్ కోసం మటన్, చికెన్, చేపలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేశా రు. న్యూ ఇయర్ వేడుకల్లో నాన్‌వెజ్‌తోపాటు ఇతర వాటికి జిల్లా ప్రజలు రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల వరకు వెచ్చించినట్లు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment