నేడు విద్యా సంస్థలకు సెలవు
నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వం బుధవా రం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సత్యానంద్
నిజామాబాద్ అర్బన్: ఐక్య ఉపాధ్యాయ ఫె డరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లావాసి సత్యానంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, గంగాధర్ మంగళవారం తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28 నుంచి 30 వరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తగ్గిన పసిడి ధరలు
నిజామాబాద్ రూరల్: బంగారం ధరలు మరోసారి కాస్త తగ్గాయి. నగరంలో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.78,800, 22 క్యారెట్ల బంగారం రూ.72,705 పలుకుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.91 వేలకు తగ్గింది.
ఉద్యోగాల పేరిట ఫోన్లు చేస్తే చర్యలు
నిజామాబాద్‌నాగారం: స్టాఫ్ నర్సు అభ్యర్థులకు ఉద్యోగాల పేరిట ఫోన్ చేసి డబ్బులు అడిగే వారి పై కఠిన చర్యలు తీసు కుంటామని డీఎంహెచ్‌వో రాజశ్రీ హెచ్చరించారు. ‘వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలంటూ ఫోన్లు’ అనే శీర్షికన ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. అభ్యర్థులు ఎవరికి డబ్బులు ఇవ్వొద్దన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా మెరిట్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చే యాలని సూచించారు. అభ్యర్థులకు ఫోన్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సందేహాలుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలాని సూచించారు.
రేపు నిజామాబాద్‌కు ఎస్సీ కమిషన్ రాక
కామారెడ్డి అర్బన్: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య క మిషన్ గురువారం నిజామాబాద్ జిల్లాకు రానుంది. ఉదయం 11గంటలకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి సలహాలు, సూచనలు, వినతులు స్వీకరించనున్నట్టు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులాలకు చెందిన ఉద్యోగులు, సంఘాల నాయకులతో పాటు ఇతరులు వినతులు ఇవ్వవచ్చన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు
ఖలీల్‌వాడి: బహింగ ప్రదేశాలలో మద్యం తాగితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ సింధుశర్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు జనవరి 1నుంచి 15 వరకు అమలులో ఉంటాయన్నారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు డీజేలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమించినచో వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment