ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగంగా పూర్తిచేయాలి
మోపాల్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. మోపాల్, కులాస్‌పూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన సర్వే వివరాలను ఆరా తీశారు. ప్రజాపాలన లో దరఖాస్తులో నమోదు కాని వారి పేర్లు నమోదు చేసేలా ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులందరి పేర్లు అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మండలంలో 9,259 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటివరకు 6,703 (74 శాతం) పూర్తయ్యిందని ఎంపీడీవో చెప్పారు. జనవ రి 3లోపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పురాతన, శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు.. వాటి స్థా నంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొస్తే, అలాంటి వారి వివరాలను కూడా యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామేశ్వర్, ఎంపీడీవో రాములు, ఎంపీవో కిరణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి హన్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment