సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ఆర్‌వోబీ నిర్మాణ పనుల పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రత్యేక చొరవతో రూ.13.27 కోట్లు విడుదలయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ డిసెంబర్ 22న కలిసి నిధుల విడుదల విషయమై చర్చించారు. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఎంపీ అర్వింద్, సీఎం రేవంత్‌రెడ్డిని ప్రత్యేకంగా కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలోని అడవిమామిడిపల్లి, అర్సపల్లిలో నిర్మిస్తున్న ఆర్‌వోబీలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కాగా, మాధవనగర్ ఆర్‌వోబీ మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం నిధులతో నిర్మిస్తున్నాయి.
● బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఆర్‌వోబీలు మంజూరు కాగా, వీటికి సంబంధించిన నిధులు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో డిపాజిట్ చేసింది. కానీ ఆ ప్రభుత్వం నిధులను మళ్లించింది. దీంతో నిర్మాణ పనులు ఆలస్యం, కాంట్రాక్టర్లు బిల్లులు రాక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రెండేళ్లుగా ఎంపీ అర్వింద్ ఆర్‌వోబీల పనుల వేగవంతంలో, బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ, రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతేగాకుండా పలుమార్లు అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి లేఖలు రాశారు.
ఎంపీ అర్వింద్ చొరవతో
రూ.13.27 కోట్లు రిలీజ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల జిల్లాకు విచ్చేసిన ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఈ విషయమై ఎంపీ చర్చించారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీనిచ్చారు. ఈ క్రమంలోనే గత నెల 22న ఎంపీ అర్వింద్ సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో ఆర్‌వోబీల పెండింగ్ బిల్లులు కూడా ఆయన దృష్టికి తీసుకురాగా, పదిరోజుల వ్యవధిలోనే మూడు ఆర్‌వోబీలకు సంబంధించి రూ.13 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేశారు. దీంతో ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment