ఆలయంలో హుండీ చోరీ
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయం, అయ్యప్ప ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి ప్రవేశించి హుండీలను చోరీ చేశారు. హుండీ నుంచి సుమారు రూ. 15వేల నగదు, వెండిని ఎత్తుకెళ్లినట్లు ఆలయ పూజారి కుమార్ శర్మ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సిద్దుల గుట్ట ఆలయ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
ఎల్లమ్మ ఆలయంలో..
కామారెడ్డి రూరల్: మండలంలోని గర్గుల్ గ్రామంలో ఆదివారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఎల్లమ్మ గుడి తాళాలను పగలగొట్టి హుండీలోని డబ్బులను, అమ్మవారిపై ఉన్న ముక్కుపుడక, పుస్తెలు (8మాసాల బంగారం) ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని దేవునిపల్లి పోలీసులు పరిశీలించి, వివరాలు సేకరించారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment