బాలుడి గొంతు కోసిన చైనా మాంజా
కమ్మర్‌పల్లి: చైనామాంజాతో ఓ బా లుడి గొంతు తెగిన ఘటన కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని పోచమ్మగల్లీలో రఘు(3) అనే బాలు డు ఇంటి ముందర ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో తెగిపోయిన గాలిపటం కిందకు వస్తుండగా దానికి ఉన్న చైనా మాంజా దారం రఘు గొంతు దగ్గర తెగింది. బాలుడికి తీవ్రంగా గాయం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
కలెక్టర్ సంక్రాంతి
శుభాకాంక్షలు
నిజామాబాద్ అర్బన్: కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రజలందరికీ సంతోషాలను పంచాలని ఆకాంక్షించా రు. జాగ్రత్తగా పండుగను జరుపుకోవాలని సూచించారు.
కుంభమేళాలో ఇందూరు కల్సా అన్నదానం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఇందూరు కల్సా శ్రీ పంచ్ తేరా భాయి ఆధ్వర్యంలో అన్నదానం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మౌని బాబా, రమాపతి దాస్ మహరాజ్( శాస్త్రి బాబా), మంగళ దాస్ మహరాజ్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నేత అనసూయ మృతి
● మెడికల్ కాలేజీకి పార్థివదేహం
అప్పగింత
నిజమాబాద్ సిటీ: సీపీఐ (ఎంఎల్) మా స్‌లైన్ రాష్ట్ర నాయకు రాలు అనసూయ అ నారోగ్యంతో సోమ వారం ఉదయం మృతి చెందారు. అనసూయ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన యాదగిరి సతీమణి. ఆమె పార్థివ దేహానికి కోటగల్లీలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు నివాళులర్పించారు. ఆమె కళ్లను లయన్స్ ఐ క్లబ్ వారికి దానం చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించారు. నాయకులు మాట్లాడుతూ.. అనసూయ మహిళా సంఘం నాయకురాలిగా విప్లవ ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, వనమాల కృష్ణ, కె రమ, ఎస్‌ఎల్ పద్మ, వి ప్రభాకర్, వి గోదావరి, ఆకుల పాపయ్య, ఎ రమేశ్ బాబు, కంజర భూమయ్య, ఏ రవీందర్, ఎం నరేందర్, పి రామకృష్ణ, ఎం వెంకన్న, ఎం సుధాకర్, బి దేవారాం, డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment