పేలిన కారు టైరు.. ఢీకొన్న బస్సు
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం ఓ కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొని ఆగగా, వెనుక నుంచి వచ్చిన బస్సు కారును ఢీకొట్టింది. ఈఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. డిచ్‌పల్లి వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు నడిపల్లి శివారులోకి రాగానే ముందు టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని, ఒక్కసారిగా వెనక్కు తిరిగి పోయింది. అదే సమయంలో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును కంట్రోల్ చేయడంతో కారులో ఉన్న ముగ్గురితో పాటు బస్సులో ఉన్న సుమారు 60 మంది ప్రయాణికులకు తృటి లో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ఎక్కువగా ధ్వంసం కాగా, బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. పలువురికి స్వల్పగాయా లు కాగా చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.
పలువురికి స్వల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment