![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/13/12vic141a-310138_mr_0.jpg.webp?itok=mWGoFXcV)
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ప్రజాప్రతినిధులు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ 14 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. రాబోయే రోజుల్లో వై నాట్ 175 లక్ష్యాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని ఆంధ్రప్రభ కాలనీలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, డెప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి ముఖ్యఅతిథిలుగా పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భవానీపురం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహానేత విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
● నందిగామ నియోజకవర్గ కేంద్రం నందిగామ పట్టణంలోని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
● మైలవరం పట్టణంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి సర్నాల తిరుపతిరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
● జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నవాబుపేటలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
● పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జెడ్పీటీసీ బాకీ బాబు, జేసీఎస్ చైర్మన్ రాచూరి చిరంజీవి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదు వసంతరావు పాల్గొని నాయకులు, కార్యక్తల మధ్య పార్టీ జెండా ఆవిష్కరించారు. యనమలకుదురులో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఊరూవాడా వేడుకగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం
![1](https://www.sakshi.com/gallery_images/2024/03/13/12viw101-310141_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment