దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్‌ | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్‌

Published Mon, Oct 28 2024 1:19 AM | Last Updated on Mon, Oct 28 2024 1:19 AM

దుర్గ

దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్‌

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం బంగారం నెక్లెస్‌ను కానుకగా సమ

ర్పించారు. మొగల్‌రాజపురానికి చెందిన మురికిపూడి వెంకటేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో కెఎస్‌.రామరావును కలిసి రూ. 1.75 లక్షలతో చేయించిన 22.5 గ్రాముల బంగారం నెక్లెస్‌ను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితుల ఆశీర్వచన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల విద్యాశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

చిలకలపూడి(మచిలీపట్నం):పాఠశాల విద్యా శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఈవో కార్యాలయంలోని సమావేశపు హాల్లో ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి జి. బాలకృష్ణ తెలిపారు. అధ్యక్షుడిగా ఎండీ హిదయతుల్లా, కార్యదర్శిగా ఎం.ఫణికుమార్‌, కోశాధికారిగా ఎండీ అబ్ధుల్‌గఫూర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎండీ బాబర్‌తో పాటు ఉపాధ్యక్షులుగా ఐదుగురు, కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా టి.సుధాకర్‌, మహిళా కార్యదర్శిగా ఎం.కల్పనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ సర్వీసెస్‌ అసోసియషన్‌ సభ్యులు నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందనలు తెలిపారు.

దీక్షాభిషేకాలు

జయప్రదం చేయాలి

మోపిదేవి:నాగుల చవితి, కార్తీకమాస దీక్షాభిషేకాలు జయప్రదం చేయాలని దేవస్థానం ఉప కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు కోరారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్తికమాస దీక్ష అభిషేకాలు నవంబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబర్‌ 5వ తేదీ మంగళవారం నాగుల చవితి మహాత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ స్వామివారి ఉచిత దర్శనంతో పాటు అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 15వ తేదీ శక్రవారం సాయంత్రం జ్వాలా తోరణం ఉంటుందని, 29వ తేదీ శుక్రవారం లోకకల్యాణార్థం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి లక్షబిల్వార్చన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైజ్‌ అవార్డుకు

వీఎంసీ ఎంపిక

పటమట(విజయవాడతూర్పు):దీన్‌దయాల్‌ అంత్యోదయ యోజన– నేషనల్‌ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపినందుకు విజయవాడ నగర పాలక సంస్థ ఫెర్ఫార్‌మెన్స్‌ రికగ్నేషన్‌ ఫర్‌ యాక్సిస్‌ టు ఫైనాన్షియల్‌ ఇంక్లూషన్‌ అండ్‌ స్ట్రీట్‌ వెండర్స్‌ ఎంపవర్‌మెంట్‌ (పీఆర్‌ఏఐఎస్‌ఈ)కు ఎంపికయింది. నేషనల్‌ అర్బన్‌ లవ్లీ హుడ్‌ మిషన్‌లో భాగంగా వీధి విక్రయదారులకు ఎక్కువ శాతంలో రుణాలు కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను ప్రోత్సహిస్తున్నందుకు, మెగా అండ్‌ మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌ క్యాటగిరీలో బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా ప్రైజ్‌ అవార్డు 2023–2024 సంవత్సరానికి ఎంపిక చేశారు. ఈ అవార్డును ఈ నెల 29న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ వీఎంసీకి ప్రదానం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దుర్గమ్మకు కానుకగా  బంగారు నెక్లెస్‌ 1
1/2

దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్‌

దుర్గమ్మకు కానుకగా  బంగారు నెక్లెస్‌ 2
2/2

దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement