బాలల వికాసానికి ప్రత్యేక చర్యలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బాలల వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. రెండు రోజులుగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతున్న 7వ అమరావతి బాలోత్సవం (పిల్లల పండుగ) ముగింపు సభ ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించడానికి ఏటా బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 78 లక్షల మంది, ప్రైవేట్ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారందరికి వికాసం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మండలిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడెం బాలోత్సవం వ్యవస్థాపకుడు డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు మాట్లాడుతూ బాల్యంలోనే ఆనందం, సృజనాత్మకత ఉంటాయన్నారు. కాకినాడ క్రియ పిల్లల పండుగ సంస్థ ప్రతినిధి ఎస్‌ఎస్‌ఆర్ జగన్నాఽథరావు మాట్లాడుతూ పిల్లలకు ఆట పాటలు ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు లేకుండా చదువులో పరి పూర్ణత రాదన్నారు. బాలోత్సవం అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, కార్యదర్శి పి.మురళీకృష్ణ, కెనరా బ్యాంకు డీజీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముగిసిన అమరావతి బాలోత్సవం
Comments
Please login to add a commentAdd a comment