No Headline
రాకేష్ బరిలో దిగితే ఆ పోటీలో ఆయన విజేతగా నిలవాల్సిందే. 2013 నుంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న ఆయన ఏకంగా తొమ్మిదిసార్లు మిస్టర్ ఆంధ్రా టైటిల్‌ను సాధించాడు. ఈ ఏడాది కేరళలో జరిగిన పోటీల్లో ఆయన విజేతగా నిలిచి ‘మిస్టర్ ఇండియా–2024’గా నిలిచాడు. రాకేష్ వద్ద శిక్షణ తీసుకున్న కొందరు కూడా ఆయన మాదిరి దేహ దారుఢ్య పోటీలకు సిద్ధపడుతున్నారు. మరికొందరు జిమ్‌లు పెట్టుకొని.. ఇంకొందరు మంచి ఉద్యోగాలను సాధించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రాకేష్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని.. నగరానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిద్దాం.
బరిలో దిగితే.. విజేతగా నిలవడమే..
Comments
Please login to add a commentAdd a comment