డిసెంబర్ 10 వరకు ప్రచార కార్యక్రమం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): హమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్ పేరిట మంగళవారం నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా తెలిపారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్(డీడబ్ల్యూఎస్‌ఎం) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ నిధిమీనా మన మరుగుదొడ్లు – మన గౌరవం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి – ఆనందంగా జీవించండి అంటూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమాజానికి విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను సత్కరించడంతో పాటు లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ నిధిమీనా మాట్లాడుతూ.. మంగళవారం ప్రారంభమైన ప్రత్యేక కార్యక్రమాలు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవమైన డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో వినూత్న ఆలోచనలతో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం అమలుకు కృషి చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈడీ బి.అర్జున్‌రావు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎస్.విద్యాసాగర్, డీపీఓ పి.లావణ్య కుమారి, ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీఎంహెచ్‌ఓ ఎం.సుహాసిని, జిల్లా నీటి, పారిశుద్ధ్య మిషన్ సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
హమారా శౌచాలయ్ – హమారా సమ్మాన్‌పై ప్రచారం ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధిమీనా
Comments
Please login to add a commentAdd a comment