ఎన్టీఆర్ జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు నరకానికి నకళ్లుగా మారాయి. ఇక్కడ ‘సంక్షేమం’ కానరావడం లేదు. శిథిలమైన భవనాలు, పెచ్చులూడుతున్న శ్లాబులు, తలుపులు లేని మరుగుదొడ్లు, ఫెన్సింగ్ లేని ప్రహరీలు ఇలా అనేక సమస్యలు ఇక్కడ తిష్ట వేశాయి. దుప్పటి నుంచి కంచం వరకు అనేక అవస్థలను ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలోని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లలో డైట్‌కు సంబంధించి బడ్జెట్ కూడా విడుదల కాలేదు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment